ప్రారంభమైన వందే భారత్ ఎక్స్ ప్రెస్

ప్రారంభమైన వందే భారత్ ఎక్స్ ప్రెస్

ఢిల్లీ నుంచి కట్రా వరకు నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభమైంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో జెండా ఊపి రైలును ప్రారంభించారు హోంశాఖ మంత్రి అమిత్ షా. రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయెల్ తో పాటు రైల్వే ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ తో ప్రధాని మోడీ మేడిన్ ఇండియా కల సాకారైమందన్నారు అమిత్ షా.

రైల్వే తీసుకువచ్చిన సంస్కరణలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దుతో   పదేళ్లలో కశ్మీర్ దశ మారబోతుందన్నారు అమిత్ షా. రెండేళ్లలో కశ్మీర్ టు కన్యాకుమారి వరకు రైల్వే లింక్ లభిస్తుందని చెప్పారు పియూష్ గోయల్. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా యాత్రికులకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను కానుకగా ఇచ్చామన్నారు.