దేశమంతగా పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.. బుధవారం ( నవంబర్6) ల్యూక్ క్రిస్టోఫర్ కౌంటిన్హో అనే వ్యక్తి ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. దేశంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది.. వెంటనే చర్యలు చేపట్టకపోతే మరింత ప్రమాదం.. ప్రజారోగ్య అత్యవసరపరిస్థితి నెలకొని స్థాయి కాలుష్యం చేరుకుంది. ఇది పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను తీవ్ర ప్రభావం చూపుతుందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.
సమగ్రమైన విధాన చట్రం ఉన్నప్పటికీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విపరీతంగా వాయు కాలుష్యం పెరిగిపోతుంది.. గాలి నాణ్యత రోజురోజుకు మరింత పేలవంగా మారుతుందని పిటిషన్ కోర్టుకు తెలిపారు. ఆర్టికల్ 21 ప్రకారం.. జీవించే, ఆరోగ్య హక్కు కింద వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వాలు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ లో కోరారు పిటిషనర్.
ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు మొదలైన ప్రధాన భారతీయ నగరాల్లో నిర్దేశించిన దానికంటే కాలుష్యం పరమితి మించిపోయిందని, PM₂.₅ , PM₁₀ వంటి కాలుష్య కారకాల వార్షిక సగటులు భారీగా పెరుగుతున్నాయని పిటిషన్ లో హైలైట్ చేశారు ఫిర్యాదు దారుడు.
పొల్యూషన్ ఇంతగా పెరిగిపోయేందుకు అధికారుల నిర్లక్ష్యమే కారణం.. దాదాపు 1.4 మిలియన్లకు పైగా ప్రజలు ప్రతి రోజు విషపూరిత గాలి పీల్చి రోగాల బారిన పడుతున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. గాలి నాణ్యత పర్యవేక్షణ కార్యక్రమాల నుంచి గ్రామీణ ప్రాంతాలను మినహాయించడం కాలుష్యాన్ని నివారించడంతో నిర్మాణాత్మక బలహీనతను సూచిస్తుందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.
