2024 జనవరి 1 నాటికి.. అయోధ్యలో రాముడి గుడి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన

2024 జనవరి 1 నాటికి..  అయోధ్యలో రాముడి గుడి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన

అగర్తల: అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం వచ్చే ఏడాది జనవరి 1 నాటికి పూర్తవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. రామ జన్మభూమి వివాదంపై కోర్టులకు వెళ్తూ కాంగ్రెస్, సీపీఎం ఎంతో కాలం పాటు గుడి నిర్మాణాన్ని అడ్డుకున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గుడి నిర్మాణం ప్రారంభించారని గుర్తుచేశారు. త్రిపురలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సబ్రూమ్ టౌన్ లో రథయాత్రను అమిత్ షా గురువారం ప్రారంభించారు. 

..అయోధ్యలో రాముడి గుడి రెడీ

ఈ సందర్భంగా జరిగిన పబ్లిక్ ర్యాలీలో ఆయన మాట్లాడారు. “రాహుల్ బాబా, సబ్రూమ్ నుంచి చెబుతున్నాను వినండి. జనవరి 1, 2024 నాటికి అయోధ్య రాముడి గుడిని పూర్తిచేస్తాం’’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు. ప్రధాని మోడీ చేతిలో దేశం సేఫ్ గా ఉందన్నారు. 

రెండున్నరేండ్లలో నిర్మాణం.. 

అయోధ్యలో రామ జన్మభూమికి సంబంధిం చిన 2.77 ఎకరాల భూవివాదంపై సుప్రీంకోర్టు 2020లో తీర్పు ఇచ్చింది. ఆ స్థలాన్ని టెంపుల్​కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బాబ్రీ మసీదుకు అయోధ్యలోనే వేరే చోట ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే ఏడాది ఆగస్ట్ 5న గుడి నిర్మాణానికి ప్రధాని మోడీ పునాదిరాయి వేశారు. ఆలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం160 స్తంభాలు, ఫస్ట్ ఫ్లోర్ లో 132 స్తంభాలు, సెకండ్ ఫ్లోర్ లో 74 స్తంభాలు ఉండేలా నిర్మాణం చేపట్టారు.