
జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. జమ్మూకాశ్మీర్ లో మళ్లీ ఉగ్ర కార్యకలాపాలు క్రమంగా పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే అక్కడ ప్రజల భయాందోళనల మధ్య మళ్లీ ఉద్రిక్తత నెలకొన్నది.గత నెల రోజులుగా హిందువులపై జరిగిన హత్యల నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ లోయలో తలెత్తిన పరిస్థితులను సమీక్షించనున్నారు అమిత్ షా. ఈ సమావేశానికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా,ఎన్‌ఎస్‌ఎ అజిత్ దోవల్, హాజరుకానున్నారు.లోయలో జరుగుతున్న ఓ వర్గ ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న హత్యలు ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా ఉండనున్నాయి.అదే సమయంలో ఉగ్రవాదులపై జరుగుతున్న ఆపరేషన్‌పై కూడా ఈ సమావేశంలో సమీక్షించనున్నారు.