జమ్ముకశ్మీర్ రాష్ట్రపతి పాలన పొడగింపు తీర్మానం ఆమోదం

జమ్ముకశ్మీర్ రాష్ట్రపతి పాలన పొడగింపు తీర్మానం ఆమోదం

జమ్ముకశ్మీర్ లో రాష్ట్రపతి పాలనను ఆరు నెలలు పొడగించింది కేంద్రప్రభుత్వం. జూన్ 12వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐతే.. దీనికి చట్టపరమైన అనుమతి కోసం.. ఇవాళ లోక్ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రపతి పాలన పొడగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఆమోదించి రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత… జులై 3 నుంచి కొత్తగా ఆరు నెలల పాటు జమ్ము కశ్మీర్ లో రాష్ట్రపతి పాలన అమలులోకి వస్తుంది. 2018 జూన్ 20 నుంచి కశ్మీర్ లో ప్రెసిడెంట్ రూల్ కొనసాగుతోంది.