దాచేందుకు ఏం లేదు. భయపడాల్సిన పని అంత కన్నా లేదు : అమిత్ షా

దాచేందుకు ఏం లేదు. భయపడాల్సిన పని అంత కన్నా లేదు : అమిత్ షా

అదానీ వ్యవహారంలో విపక్షాల ఆరోపణలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఈ అంశంలో బీజేపీకి దాచాల్సిందేమీలేదని, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదని అన్నారు. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ఈ విషయంపై మాట్లాడటం సరికాదని aniకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా స్పష్టం చేశారు. ప్రభుత్వంపై వచ్చే ఆరోపణల్లో నిజాలు లేవని, అవన్నీ బీజేపీని ఎదుర్కోలేక ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలని అన్నారు.  

‘అదానీ, హిండెన్ బర్గ్ వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. అందుకే ఈ అంశంపై మాట్లాడటం సరికాదు. అదానీ–హిడెన్‌బర్గ్‌ విషయంలో బీజేపీ ప్రభుత్వం దాచడానికి ఏమీ లేదు, భయపడాల్సిన పనిలేదు. సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. దీనికి ప్రభుత్వం కూడా అంగీకరించింది. బీజేపీపై రాహుల్ గాంధీ చేస్తున్న  ఆరోపణలకు ఆధారాలుంటే చూపాలి. ఇప్పటి వరకు బీజేపీపై ఎవరూ ఇలాంటి ఆరోపణలు చేయలేదు. (కాంగ్రెస్) హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయి. దర్యాప్తు సంస్థలు వాటిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాయి. అయితే ఆ కేసుల్లో ఎంతమందికి శిక్ష పడింది. అధికారంలో ఉన్న వాళ్లను ఎందరో వచ్చి కలుస్తుంటారు. అంతమాత్రాన వాళ్లతో స్నేహం ఉందని, వారి మధ్య లావాదేవీలు జరిగాయని అనడం కరెక్టు కాదు’ అని అమిత్ షా అన్నారు.