
- దాన్ని బీజేపీ ఎన్నటికీ ఒప్పుకోదు
జౌన్‌పూర్ (యూపీ): దేశాన్ని సౌత్, నార్త్గా విభజించాలని చూస్తున్నారని.. అందుకు బీజేపీ ఎన్నటికీ ఒప్పుకోదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ‘‘దేశాన్ని సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అంటూ రెండు ముక్కలు చేయాలని కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేస్తున్నారు.
ఒకసారి దేశాన్ని విభజించిన కాంగ్రెస్.. మరోసారి కూడా విభజించాలని చూస్తున్నది” అని ఆరోపించారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలలో అమిత్ షా మాట్లాడారు. దేశంలో టెర్రరిజం పెరిగిపోవడానికి కారణమైన ఆర్టికల్ 370ని కాంగ్రెస్ పార్టీ 70 ఏండ్లు కొనసాగించిందని విమర్శించారు.