ప్రజలు అడిగిన రోజు తప్పకుండా రాజీనామా చేస్తా

ప్రజలు అడిగిన రోజు తప్పకుండా రాజీనామా చేస్తా

మమత బెనర్జీ తనను పదేపదే రాజీనామా చేయాలని అడుగుతున్నారన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రజలు అడిగిన రోజు తాను తప్పకుండా రాజీనామా చేస్తా అన్నారు. కానీ మే 2వ తేదీన మమతకు రాజీనామా తప్పదన్నారు. అందుకు మమత సిద్ధం కావాలన్నారు. బెంగాల్ లో ఎన్నికల ప్రచారం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రానాఘాట్ దక్షిణ్ లో రోడ్ షో నిర్వహించారు. బసిరాట్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి రాగానే... బెంగాల్ లో హింసను అంతం చేస్తామన్నారు.