మట్టి పార ఏది..? రాష్ట్ర BJP నేతలపై అమిత్ షా అసహనం

మట్టి పార ఏది..? రాష్ట్ర BJP నేతలపై అమిత్ షా అసహనం

మొక్క నాటి వట్టి చేతులతో మట్టి నింపిన అమిత్ షా

రాష్ట్ర BJP నేతలపై పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫుల్ సీరియస్ అయ్యారు. తన పర్యటన, రాక సందర్భంగా నేతలు హడావుడి పడుతుండటంతో సీరియస్ అయ్యారు అమిత్ షా. ఎందుకు తొందర పడుతున్నారంటూ చిరు కోపం ప్రదర్శించారు అమిత్ షా.

స్కూల్ లో మొక్క నాటే సమయంలోనూ నేతల తీరుపై అమిత్ షా కోపానికి వచ్చారు. మట్టి నింపేందుకు అక్కడ పార ఏర్పాటు చేయలేదు రాష్ట్ర నాయకులు. పార తెప్పించేందుకు అప్పటికప్పుడు ప్రయత్నం చేశారు నేతలు. వేరేవాళ్లను పురమాయించారు. దీంతో.. అమిత్ షా కోపం ప్రదర్శించారు. కోపంతో చేతులతోనే గుంతలో మట్టిని నింపారు అమిత్ షా.

రంగనాయక్ తండాలో సోనిబాయి నాయక్ కు బీజేపీ సభ్యత్వ పేపర్ అందజేసే సమయంలోనూ నేతల తీరుపై అసంతృప్తి ప్రదర్శించారు అమిత్ షా.