Fish Venkat: పాపం ఫిష్ వెంకట్.. హాస్పిటల్కు వెళ్లి మరీ.. సాయం చేసిన ఈయన ఎవరంటే..

Fish Venkat: పాపం ఫిష్ వెంకట్.. హాస్పిటల్కు వెళ్లి మరీ.. సాయం చేసిన ఈయన ఎవరంటే..

హైదరాబాద్: అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నటుడు ఫిష్ వెంకట్ను ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పరామర్శించారు. ఉప్పల్ పరిధిలోని బోడుప్పల్ RBM హాస్పిటల్లో ఫిష్ వెంకట్ చికిత్స పొందుతుండటంతో మెట్టు సాయి కుమార్ హాస్పిటల్కు వెళ్లి ఆర్థిక సహాయం చేశారు. ఫిష్ వెంకట్ స్పృహలోనే ఉన్నప్పటికీ ఎవరినీ గుర్తుపట్టలేకపోతున్నాడు.

కొన్నేళ్ల క్రితమే ఆయనకు బీపీ, షుగర్ ఎటాక్ అయి ఇన్ఫెక్షన్ పెరిగిపోవడంతో కాలికి ఆపరేషన్ చేశారు. ‘ఆది’ సినిమాలో ‘తొడ కొట్టు చిన్నా’ అని ఫిష్ వెంకట్ చెప్పిన డైలాగ్ అప్పట్లో తెగ పాపులర్ అయింది. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాలో ఫిష్ వెంకట్ క్యారెక్టర్ ఫుల్ ఫన్ పంచింది.

తెలుగు సినీ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. విలన్ గ్యాంగ్లో కనిపిస్తూ నవ్వులు పూయించే ఫిష్ వెంకట్ ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నాడు. ఆయన కిడ్నీలు పూర్తిగా పాడయిపోవడంతో వైద్యులు డయాలసిస్ చేస్తున్నారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. కొన్ని నెలల క్రితం ఇలానే ఫిష్ వెంకట్ అనారోగ్యానికి గురికావడంతో చికిత్స అందించారు. ఆ సమయానికి ఆయన ఆరోగ్యం మెరుగుపడింది.

ALSO READ | Fish Venkat: పాపం ఫిష్ వెంకట్.. వెంటిలేటర్పై ట్రీట్మెంట్.. ఆయనకు అసలు ఏమైందంటే..

మళ్లీ.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే ఆయన కోలుకోవడానికి ఉన్న ఒకేఒక్క ఆప్షన్ అని వైద్యులు తేల్చి చెప్పారు. సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా స్పందించి ఫిష్ వెంకట్ వైద్యానికి సాయం చేయాలని ఆ కుటుంబం కోరుతోంది. ఫిష్ వెంకట్కు భార్య, ఒక కూతురు ఉన్నారు. హాస్పిటల్ బిల్లులు పెరిగిపోతుండటంతో ఆయన కుటుంబం ఆందోళనలో ఉంది.