ఒడిషా, బెంగాల్ ను ఆదుకుంటామన్న అమిత్ షా

ఒడిషా, బెంగాల్ ను ఆదుకుంటామన్న అమిత్ షా

న్యూఢిల్లీ : అంఫాన్ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఒడిషా, బెంగాల్ రాష్ట్రాలను ఆదుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. రెండు రాష్ట్రాల సీఎం లు నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీలతో ఆయన ఫోన్ లో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం తరఫున అండగా ఉంటామని ఇరు రాష్ట్రాల సీఎంలకు చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ సహాయక చర్యల్లో ఉన్నాయని వారి సూచనలను ప్రజలు పాటించాలని కోరారు. అవసరమైతే తప్ప ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల ప్రజలు నివాసాల నుంచి బయటకు రావద్దని సూచించారు. ప్రతి పౌరున్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అంఫాన్ తుపాన్ సృష్టించిన బీభత్సం కారణంగా పదుల సంఖ్యలో జనం చనిపోయారు. కరోనా కన్నా ఎక్కువ నష్టం మిగిల్చిందంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు.