ఈటలను పిలవగానే దద్దరిల్లిన నిర్మల్ సభ

V6 Velugu Posted on Sep 17, 2021

అమిత్ షా నిర్మల్ సభ మొత్తం ఈటల రాజేందర్ సెంట్రిక్ గానే జరిగింది. సభ మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఈటల పేరు ప్రస్తావిస్తూనే ఉన్నారు అమిత్ షా. రెండో వరుసలో కూర్చుకున్న ఆయనను వేదికపై ముందుకు పిలిచి మరీ మాట్లాడారు. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ ను గెలిపించి.. రాష్ట్రంలో ఉన్న డబ్బుల రాజకీయానికి, కుటుంబ రాజకీయానికి ముగింపు పలుకుదామని పిలుపునిచ్చారు. ప్రతీ ఎన్నికను డబ్బులతో గెలవొచ్చని టీఆర్ఎస్ అనుకుంటోందని విమర్శించారు అమిత్ షా. తెలంగాణ ప్రజలు రాజేందర్ ను గెలిపిస్తారా? పైసల సర్కారును గెలిపిస్తారా? కుటుంబ పాలనను గెలిపిస్తారా? అని వేధిక ముందున్న వారిని ప్రశ్నించారు. 

Tagged amit shah, Eatala Rajender, Invite, Nirmal Sabha

Latest Videos

Subscribe Now

More News