
దేశ మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి సర్ధార్ వల్లభ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా... గుజరాత్‌లోని కేవాడియాలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర రాష్ట్రీయ ఏక్తా దివస్ ఉత్సవాల్లో దేశ హోంమంత్రి అమిత్ షా, సీఎం భూపేంద్ర పటేల్ పాల్గొని పటేల్‌కు నివాళులర్పించారు. తర్వాత ప్రమాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరేడ్‌లో గౌరవ వందనం స్వీకరించారు. భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్‌తో పాటు మరికొందరు అథ్లెట్స్ కూడా ఈ పరేడ్‌లో పాల్గొన్నారు.