అండమాన్ జైలును సందర్శించిన అమిత్‌ షా

అండమాన్ జైలును సందర్శించిన అమిత్‌ షా

కేంద్ర మంత్రి అమిత్ షా.. అండమాన్ నికోబార్ దీవుల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. మూడ్రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజైన శుక్రవారం పోర్ట్‌ బ్లైర్‌‌లోని  నేషనల్ మెమోరియల్ సెల్యులార్ జైలును అమిత్‌ షా సందర్శించారు. అమరవీరుల స్తూపం దగ్గర పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో వీర్ సావర్కర్ బ్రిటిషర్లు బందీగా ఉంచిన సెల్‌ను సందర్శించి నివాళులర్పించారు. తర్వాత ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమానికి కేంద్ర మంత్రి అమిత్ షా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండమాన్ సెల్యూలార్ జైలును సావర్కర్ ఒక పవిత్ర క్షేత్రం (తీర్థ స్థాన్)లా మార్చేశారని అన్నారు. దేశ స్వాతంత్ర్యం తన జన్మ హక్కు అని నినదించిన వీర్ సావర్కర్‌‌ ఆ హక్కును సాధించుకునేందుకు ఎంతటి చిత్రహింసలనైనా అనుభవించేందుకు సిద్ధమేనన్న సందేశాన్ని ప్రపంచానికి చాటారని అమిత్‌ షా చెప్పారు. నాడు ఆయన ఉన్న సెల్‌ను సందర్శించి, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తుంటే తాను ఎంతో భావోద్వేగానికి లోనయ్యానని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

దేవుడి దర్శనం కోసం.. అర్ధరాత్రి కర్రల సమరం

ఉద్యమ సమయంలో వివేక్‌ చేసిన సాయం మర్చిపోతే ఎట్ల?: అంబాల సతీష్

ఇండోనేషియాలోనూ దసరా సంబురాలు