ఉద్యమ సమయంలో వివేక్‌ చేసిన సాయం మర్చిపోతే ఎట్ల?

ఉద్యమ సమయంలో వివేక్‌ చేసిన సాయం మర్చిపోతే ఎట్ల?

టీఆర్‌‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై రామగుండం నియోజకర్గం బీజేపీ నేత అంబాల సతీష్  ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామిపై సుమన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆయనను విమర్శించే స్థాయి బాల్క సుమన్‌కు లేదన్నారు. ఉద్యమ సమయంలో వివేక్ వెంకటస్వామి చేసిన సాయాన్ని మర్చిపోయి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ముందు చెన్నూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తీర్చాలని సుమన్ కు సూచించారు అంబాల సతీష్.