ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..ముఖ్య అతిథిగా అమిత్ షా

ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..ముఖ్య అతిథిగా అమిత్ షా

మొట్టమొదటిసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కేంద్రప్రభుత్వం నిర్వహించనుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 8ఏళ్ల తర్వాత దేశరాజధానిలో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. ఈ వేడుకలకు హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. జూన్ 2న సాయంత్రం 6.30 నుంచి న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. 

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పడంతో పాటు దేశంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం నేపథ్యాన్ని వివరించే లక్ష్యతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో సింగర్స్ మంగ్లీ,హేమచంద్ర తమ పాటలతో అలరించనున్నారు. ఇక తెలంగాణ జానపద కళాకారులు రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పనున్నారు. అదేవిధంగా ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ లో భాగంగా హర్యానాలోని వివిధి పాఠశాలల విద్యార్థులు ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అయితే ప్రతిసారి ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో రాష్ట్రప్రభుత్వం ఈ వేడుకలను నిర్వహిస్తుండగా..ఈ సారి కేంద్రం నిర్వహిస్తుండడం గమనార్హం.

మరిన్ని వార్తల కోసం

లెస్బియన్ జంట కేసులో కేరళ హైకోర్టు కీలక తీర్పు

మంకీపాక్స్పై మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం