లెస్బియన్ జంట కేసులో కేరళ హైకోర్టు కీలక తీర్పు

లెస్బియన్ జంట కేసులో కేరళ హైకోర్టు కీలక తీర్పు

లెస్బియన్ జంట కేసులో మంగళవారం (మే 31న) కేరళ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఇద్దరు అమ్మాయిలు కలిసి ఉండేందుకు అనుకూలంగా కీలక తీర్పునిచ్చింది. ఇద్దరు అమ్మాయిలు కలిసి జీవించేందుకు వారి తల్లిదండ్రులు అంగీకరించలేదు. చివరకు కేరళ హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో .. న్యాయస్థానం తీర్పు తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిశారు. 

కేరళకు చెందిన ఇద్దరు యువతులు గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో మందలించారు. ఇద్దరిని బలవంతంగా విడదీశారు. ఈ క్రమంలో ఇద్దరిలో ఓ యువతి కేరళ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. ఇద్దరూ కలిసి జీవించాలనే కోరికను వ్యక్తం చేయడంతో జస్టిస్ కే. వినోద్ చంద్రన్. సి. జయచంద్రన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ ఇద్దరు యువతులకు అనుకూలంగా తీర్పు చెప్పింది. 

తాము చదువుకునే రోజుల నుంచే ప్రేమించుకుంటున్నామని, ఈ విషయం తెలిసి ఇరు కుటుంబాల వారు తమను విడదీశారని ఓ యువతి తెలిపింది. డిగ్రీ పూర్తి చేసి, ఉద్యోగాల కోసం ఊరు వదిలివెళ్లినప్పుడు పరిస్థితులు తారుమారు అయ్యాయని, తమ ఇద్దరిని తల్లిదండ్రులు మానసికంగా హింసించారని వాపోయింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తాము కలిసి జీవించే హక్కు ఉందని మరో యువతి తెలిపింది. కేరళ హైకోర్టు తీర్పుతో ఇప్పుడు వీరిద్దరూ కలిసి జీవించేందుకు మార్గం సుగమమైంది.

మరిన్ని వార్తల కోసం..

జూన్ 9 వరకు సత్యేంద్ర జైన్ కస్టడీ

సత్తా చాటిన ఉమెన్స్ ..షూటింగ్ వరల్డ్ కప్లో భారత్కు స్వర్ణం