సత్తా చాటిన ఉమెన్స్ ..షూటింగ్ వరల్డ్ కప్లో భారత్కు స్వర్ణం

సత్తా చాటిన ఉమెన్స్ ..షూటింగ్ వరల్డ్ కప్లో భారత్కు స్వర్ణం

ISSF ప్రపంచ కప్ 2022లో భారత మహిళల జట్టు సత్తా చాటింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. ఇలవేనిల్, రమిత, శ్రేయాలతో కూడిన ఉమెన్స్ టీమ్..డెన్మార్క్ జట్టుపై 17-5 స్కోరు తేడాతో గెలుపొంది..ఈ టోర్నీలో ఇండియాకు ఫస్ట్ గోల్డ్ మెడల్ను అందించింది. అజర్‌బైజాన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో క్వాలిఫయింగ్‌ స్టేజ్‌–1లో ఇలవేనిల్, రమిత, శ్రేయ జట్టు 944.4 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. క్వాలిఫయింగ్‌ స్టేజ్‌–2లో  628.6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌ చేరింది. ఫైనల్లో డెన్మార్క్‌ను ఓడించి స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు  10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మెన్స్ టీమ్..కాంస్య పతక పోరులో ఓటమిపాలైంది. క్రొయేషియా చేతిలో 16-10 తేడాతో పరాజయం చవిచూసింది.