మంకీపాక్స్పై మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం 

మంకీపాక్స్పై మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం 

మంకీపాక్స్పై కేంద్రం అప్రమత్తమైంది. దేశంలో ఇప్పటి వరకు ఒక్క కేసు నమోదుకాకపోయినా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. ముందు జాగ్రత్త చర్యగా మంకీపాక్స్కు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. అనుమానితుల శాంపిళ్లను పూణేలోని ఎన్ఐవీ లాబొరేటరీకి పంపాలని సూచించింది. ఒకవేళ పాజిటివ్‌ కేసు నమోదైతే కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌ చేయాలని చెప్పింది. బాధితులు గత 21 రోజుల్లో ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారో గుర్తించి వారిని ఐసొలేట్‌ చేయాలని సూచించింది.

మంకీపాక్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది. అరుదైన సందర్భాల్లో మాత్రమే వైరస్ తీవ్రత పెరుగుతుందని చెప్పింది. మంకీపాక్స్ వైరస్‌ జంతువు నుంచి మనిషికి, మనిషి నుంచి మనిషికి సోకుతుంది. స్వలింగ సంపర్కుల్లో ఈ వ్యాధి ఎక్కువగా సోకుతున్నట్టు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. చర్మం నుంచి వెలువడే ద్రవాలు, తుంపర్లు, కండ్లు, ముక్కు, నోటి నుంచి వచ్చే ద్రవాలు, బాధితులు తాకిన వస్తువుల ద్వారా వైరస్ సంక్రమించే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తల కోసం..

రాష్ట్రాన్ని నెంబర్ వన్గా తీర్చి దిద్దిన ఘనత కేసీఆర్దే

జూన్ 10లోపు ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలె