రాష్ట్రాన్ని నెంబర్ వన్గా తీర్చి దిద్దిన ఘనత కేసీఆర్దే

రాష్ట్రాన్ని నెంబర్ వన్గా తీర్చి దిద్దిన ఘనత కేసీఆర్దే

తొర్రూరు: పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. మంగళవారం తొర్రూరులోని ఎల్వైఆర్ గార్డెన్ లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... జూన్ 3 నుంచి 15 రోజుల పాటు పల్లె,  పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.11,711 కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు. పల్లె ప్రగతిని విజయవంతం చేయడంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు  కీలక పాత్ర పోషించాలన్నారు.  

దేశంలో రాష్ట్రాన్ని నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. సంసద్ ఆదర్శ గ్రామీణ యోజనలో 20 ఉత్తమ గ్రామాలను కేంద్రం ఎంపిక చేయగా... వాటిలో 19 తెలంగాణవేనని తెలిపారు. హరితహారం, పల్లె ప్రకృతి వనాల వల్ల రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం 7.7 శాతం పెరిగిందని చెప్పారు. పల్లె ప్రగతి మొదటి రోజు గ్రామాల్లో పాదయాత్రలు, పల్లె ప్రగతి గురించి ప్రజలకు తెలిసేలా ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా హరితహారం, పెండింగ్ లో ఉన్న వైకుంఠధామాల నిర్మాణం, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. 

మరిన్ని వార్తల కోసం...

జూన్ 10లోపు ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలె

మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో డీకేకు ఢిల్లీ కోర్టు స‌మ‌న్లు