మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో డీకేకు ఢిల్లీ కోర్టు స‌మ‌న్లు

మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో డీకేకు ఢిల్లీ కోర్టు స‌మ‌న్లు

న్యూఢిల్లీ :  2018లో నమోదైన మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో కర్నాట‌క కాంగ్రెస్ చీఫ్ డీకే శివ‌కుమార్‌కు ఢిల్లీ కోర్టు మంగ‌ళ‌వారం (మే31న) స‌మ‌న్లు జారీ చేసింది. జులై 1వ తేదీన కోర్టు ఎదుట హాజ‌రు కావాల‌ని ప్రత్యేక న్యాయమూర్తి వికాస్‌ ధుల్‌.. డీకే శివకుమార్‌ను ఆదేశించారు. మే 26న డీకే శివ‌కుమార్ స‌హా ప‌లువురిపై ఢిల్లీ కోర్టు ముందు ఈడీ చార్జిషీట్ దాఖ‌లు చేసింది.

డీకే శివ‌కుమార్‌, ఢిల్లీలోని క‌ర్నాట‌క భ‌వ‌న్ ఉద్యోగి ఆంజ‌నేయ హ‌నుమంత‌య్యతో పాటు ప‌లువురిపై 2018 సెప్టెంబ‌ర్‌లో ఈడీ మ‌నీల్యాండ‌రింగ్ కేసు న‌మోదు చేసింది. 2017, 2018 మధ్య చేసిన తనిఖీల ఆధారంగా 2019 సెప్టెంబర్‌ 3న డీకేను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. పన్ను ఎగవేత, కోట్లాది రూపాయల 'హవాలా' లావాదేవీల ఆరోపణలపై బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో గత ఏడాది వారిపై ఆదాయపు పన్ను శాఖ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఆధారంగా ఈ కేసు నమోదైంది.

త‌న‌కు ఢిల్లీ కోర్టు స‌మ‌న్లు జారీ చేయ‌డంపై డీకే శివ‌కుమార్ స్పందించారు. రాజ‌కీయ దురుద్దేశంతోనే ఇలా చేస్తున్నార‌ని ప‌రోక్షంగా బీజేపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌న‌పై ఆరోప‌ణ‌లు ఉంటే ఇన్నేళ్లు ఎందుకు చ‌ర్య‌లు తీసుకోకుండా ఇప్పుడే ఎందుకు హ‌డావుడి చేస్తున్నార‌ని ప్రశ్నించారు. 

మరిన్ని వార్తల కోసం..

సత్తా చాటిన ఉమెన్స్.. షూటింగ్ వరల్డ్ కప్లో భారత్కు స్వర్ణం

మగాడినైతే బాగుండేది.. ఈ నొప్పి ఉండేది కాదు..