జూన్ 10లోపు ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలె

జూన్ 10లోపు ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలె

దుబ్బాక: టీఆర్ఎస్ మంత్రులు గాలిమోటర్లలో తిరుగుతూ గాలి మాటలు చెబుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. మంగళవారం దుబ్బాక క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సీఎం రిలీఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. యాసంగి వడ్లు వాకిట్లో తడుస్తుంటే..  వానకాలం పంట కోసం ఆలోచన చేస్తోందని టీఆర్ఎస్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. రైతుల కష్టాలు తెలుసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

 

ఓ వైపు ధాన్యం కొనుగోళ్ల జాప్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతోంటే... మంత్రులు గాలి మోటర్లలో చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతుల కష్టాలు తెలియాలంటే నేల మార్గాన రావాలే తప్ప... గాలిమోటర్లలో కాదన్నారు. గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన రైతు సదస్సులో వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి హెలిక్యాప్టర్ లో రావడం విడ్డూరంగా ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల గురించి పట్టించుకోవడం తక్కువై... సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమే ఎక్కువైందన్నారు. జూన్ 10 వరకు ఒక్క గింజ లేకుండా కొనుగోలు చేయాలని... లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

మరిన్ని వార్తల కోసం...

జూన్ 9 వరకు సత్యేంద్ర జైన్ కస్టడీ

సత్తా చాటిన ఉమెన్స్ ..షూటింగ్ వరల్డ్ కప్లో భారత్కు స్వర్ణం