అమిత్ షా సైలెంట్ టూర్

అమిత్ షా సైలెంట్ టూర్

కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే అమిత్ షా చేసిన తొలి పర్యటన జమ్మూకాశ్మీర్ రాష్ట్రం లోనే. గడచిన పాతికేళ్లలో ఎలాంటి వ్యతిరేకత, నిరసనలు లేకుం డా జూన్ 26–27 తేదీల్లో రెండు రోజుల పర్యటన జరిగిపోయింది. వేర్పాటువాదులుగానీ, మిలిటెం ట్ ఫ్రంటల్ ఆర్గనై జేషన్లుగానీ, ఇతర ప్రజా సంఘాలుగానీ ఏవీ బంద్ పాటించలేదు. కనీసం ప్లకార్ డుల ప్రదర్శనకూడా లేదు. అలాగని అమిత్ షా పర్యటనను కాశ్మీరీలు స్వాగతించినట్లు అనుకోకూడదు. కాశ్మీర్ వేర్పాటువాద సంస్థల్లో చీలిక ఏర్పడింది. చాలా మంది హురియత్ నాయకులు అరెస్టయ్యారు. బయట ఉన్నవారిలో కేంద్రంతో తగాదా ఎందుకులే అని మౌనంగా ఉండిపోయారు. ఈ రకంగా వేర్పాటు వాదులను కన్ఫ్యూజన్ లో పడేశారు అమిత్ షా.కాశ్మీర్ లో పెద్ద నాయకులు ఎవరినీ ఆయన కలవలేదు. ఎవరైనా అపాయింట్ మెంట్ అడిగినా, తనది రాజ కీయ పర్యటన కాదనే సంకేతాన్నిచ్చారు. జమ్మూ కాశ్మీర్ లోని సుమారు 40 వేలమంది వార్డు మెంబర్లు, సర్పం చ్ లతోమాత్రం సమావేశమయ్యారు. వీరంతా పోయినేడాది చివరలో పంచాయతీ ఎన్నికల్లో గెలిచినవారు. ఆయన తన పర్యటనలో ఎవరూ ఊహిం చని విధంగా… సీఆర్ పీఎఫ్ జవాన్ అర్షద్ ఖాన్ ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుం బంలో ఒకరికి అపాయింట్ మెంట్ లెటర్ ని స్వయంగా అందించా రు. జూన్ లో జరిగిన మిలిటెంట్ దాడిలో చనిపోయిన అయిదుగురు జవాన్లలో అర్షద్ ఖాన్ ఒకరు. వేర్పాటువాద నాయకులను, ఇతర ముఖ్య నాయకులను కలవకుండా ఒక ముస్లిం జవాన్ ఇంటికి వెళ్లడం ద్వారా తమ ప్రభుత్వ ప్రయారిటీలను అమిత్ షా చెప్పినట్లయ్యింది. ఆయన పర్యటనకు అజెం డాగా అమర్ నాథ్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్ల పరిశీలనని చెప్పుకొచ్చారు. కానీ, జమ్మూ కాశ్మీర్ విషయంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ముందుగా గ్రౌండ్ ప్రిపరేషన్ చేసుకున్నా రు. ఈ పర్యటన తర్వాతనే చకచకా అనేక పరిణామాలు జరిగిపోయి, చివరకు ఆర్టికల్ 370 రద్దుకి దారి తీశాయి.