ఆసుపత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్

ఆసుపత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ఆసుపత్రిలో చేరారు. 81 ఏళ్ల బిగ్ బి యాంజియోప్లాస్టీ సర్జరీ కోసం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు బిగ్ బి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.  బిగ్ బి  నీనా గుప్తా నటించిన గుడ్ బై చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం బిగ్ బి ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న  కల్కి చిత్రంలో నటిస్తున్నారు.  ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది.