
సినీ ఇండస్ట్రీలో వయసుతో పాటు గ్లామర్, ఆఫర్స్ తగ్గుతాయంటారు. అవి తగ్గితే పేరు, డబ్బు, క్రేజ్, ఇమేజ్ అన్నీ ఆటోమేటిగ్గా తగ్గుతాయి. అయితే అది అమితాబ్ విషయంలో మాత్రం కాదు. డెబ్భె యేడేళ్ల వయసులో కూడా ఆయన చేతినిండా సినిమాలున్నాయి. అవి కాక యాడ్స్. డబ్బు వస్తూనే ఉంది. ఇమేజ్ పెరుగుతూనే ఉంది. జనంలో క్రేజ్ కూడా అలానే ఉంది. ఎన్ని జెనరేషన్స్ మారినా, ఎందరు స్టార్స్ పుట్టుకొచ్చినా ఆయన స్థానం ఆయనదే అని తేల్చేసింది టీఆర్‌ఏ రీసెర్చ్ రిపోర్ట్. ఈ యేటి మోస్ట్ డిజైర్డ్ పర్సనాలిటీల లిస్టు వేస్తే, అందులో మొదటి స్థానంలో నిలిచారు బిగ్ బీ. తర్వాతి రెండు స్థానాల్లో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ నిలబడ్డారు. సౌత్ హీరోలైన రజినీకాంత్ పదిహేనో స్థానంలో, రామ్‌చరణ్ పంతొమ్మిదో స్థానంలో, రవితేజ ఇరవై రెండో స్థానాల్లో ఉన్నారు. మాధురీ దీక్షిత్ ఆరో స్థానంలో ఉంటే.. హీరోయిన్లెవరూ ఆమె దరిదాపుల్లోకి కూడా రాలేదు. ఎంతోమంది యంగ్ హీరోలు వచ్చి స్టార్స్ అయినా.. అందర్నీ పక్కకు నెట్టి బిగ్ బీ మొదటి స్థానంలో ఉన్నారంటే ఆయనకున్న ఫాలోయింగ్ ఏపాటిదో అర్థమైపోతోంది. దటీజ్ అమితాబ్!