ట్రాఫిక్ లో చిక్కుకుని.. లిఫ్ట్ అడిగి బైక్ పై వెళ్లిన అమితాబ్

ట్రాఫిక్ లో చిక్కుకుని.. లిఫ్ట్ అడిగి బైక్ పై వెళ్లిన అమితాబ్

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఒక తెలియని వ్యక్తిని లిఫ్ట్ అడిగి అతని బైక్ పై తన షూటింగ్ ప్రాంతానికి చేరుకున్నాడు. ఇదేదో సినిమా షూటింగ్ కోసమొ కాదు.. నిజంగా జరిగింది. అందేంటి ఆయనకీ అన్ని కార్లు ఉంటాయి కదా.. వేరే వాళ్ళని లిఫ్ట్ అడగడం ఏంటా అని అనుకుంటున్నారా? అసలు విషయం ఏంటంటే.. అమితాబ్ తన కొత్త సినిమా షూటింగ్ కోసం కారులో వెళుతుండగా.. మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది.

దీంతో చాలా సేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో వెంటనే కారు దిగి పక్కునే ఉన్న ఒక వ్యక్తిని లిఫ్ట్ అడిగి అతని బైక్ పై తన షూటింగ్ ప్లేస్ కు చేరుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్స్టాలో పోస్ట్ చేసిన అమితాబ్.. "లిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు మిత్రమా. ఈ భయంకరమైన ట్రాఫిక్ జామ్ లో కూడా నన్ను సమాయానికి షూటింగ్ ప్లేస్ కి చేర్చారు. మీకు కృతజ్ఞతలు" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం అమితాబ్ షేర్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇది చూసియన ఆయన ఫ్యాన్స్ "అంత పెద్ద స్టార్ అయుండి కూడా ఇంత సింపుల్ గా లిఫ్ట్ అడిగి వెళ్లడం చాలా గ్రేట్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.