కౌన్ బనేగా కరోడ్ పతి 17లో.. సాహస వనితలు..

కౌన్ బనేగా కరోడ్ పతి 17లో.. సాహస వనితలు..
  • సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్, ప్రేరణా దేవస్థలితో అమితాబ్ ప్రోగ్రాం

న్యూఢిల్లీ: కౌన్ బనేగా కరోడ్ పతి(కేబీసీ)17 సీజన్‌‌లో స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఎపిసోడ్ (ఎపిసోడ్5) చాలా మెమరబుల్​గా జరిగింది. హోస్ట్ అమితాబ్ బచ్చన్ ఆర్మీ నుంచి కర్నల్ సోఫియా ఖురేషి, ఎయిర్‌‌ఫోర్స్ నుంచి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, నేవీ నుంచి కమాండర్ ప్రేరణా దేవస్థలిని హాట్ సీట్‌‌పైకి ఆహ్వానించారు.

పహల్గాం టెర్రరిస్టు ఎటాక్​తర్వాత భారత్​ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో ఈ ముగ్గురూ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ షోలో వారు తమ జర్నీని, రక్షణ దళాల్లో చేరిన తర్వాత తమ అనుభవాలు, దేశసేవలో పాల్గొంటున్న తీరును వివరించారు. మహిళా సాధికారత, సైనిక దళాల్లో మహిళల పాత్ర గురించి చర్చలు జరిగాయి.

ప్రేరణా దేవస్థలి భారత నేవీలో మొదటి మహిళా షిప్ కమాండర్‌‌గా చరిత్ర సృష్టించారు. క్విజ్​లో అడిగిన అన్ని ప్రశ్నలకు వారు సమాధానాలు చెప్పి రూ.25 లక్షలు గెలుచుకున్నారు. ఆ మొత్తాన్ని వారు రక్షణ సంస్థల సంక్షేమ నిధులకు విరాళంగా ఇచ్చారు. ఈ ఎపిసోడ్​ సోనీ లివ్​లో శుక్రవారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.