డెబ్బై ఏండ్ల వయస్సులో అక్షరాలు దిద్దడమే కాకుండా... అంతకు రెట్టింపు ఉత్సాహంతో ఎగ్జామ్‌కు హాజరయ్యారు. ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమంలో భాగంగా 100 రోజుల పాటు చదువు నేర్చుకున్న మహిళలు, వృద్ధులకు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పలు సెంటర్లలో ఎగ్జామ్ నిర్వహించారు.
వృద్ధులు తమకు అనువైన సమయంలో వచ్చి మూడు గంటల పాటు కూర్చొని అక్షరాలు, పదాలు, అంకెలు రాయడమే కాకుండా కూడికలు, తీసివేతల వంటి లెక్కలు సైతం చేశారు. ఈ ఎగ్జామ్‌కు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 1,724 సెంటర్లు ఏర్పాటు చేయగా.. మొత్తం 82,499 మంది హాజరయ్యారు. ఈ ఎగ్జామ్‌లో మంచి మార్కులు సాధించిన వారికి మెరిట్ సర్టిఫికెట్లు ఇస్తామని వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ తుమ్మ రమేశ్ తెలిపారు. -
