‘అమ్మపాలు అమృతాలు’ పాట ఆవిష్కరణ

‘అమ్మపాలు అమృతాలు’ పాట ఆవిష్కరణ

బషీర్​బాగ్, వెలుగు: తల్లిపాల ప్రాధాన్యతను చాటి చెప్పే అమ్మపాలు అమృతాలు అనే వీడియో సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ , ప్రముఖ గాయకుడు రామాచారి గురువారం ఆవిష్కరించారు. సిరిసిల్లకు చెందిన పిల్లల వైద్య నిపుణుడు, నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఈ సాంగ్​రూపొందించారు. 

ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ రచించగా, వర్ధమాన గాయకుడు గుండ్లూరు రవీంద్రబాబు పాడారు. ఆధునిక జీవనశైలిలో తల్లులు పాలివ్వకపోవడం వల్ల పిల్లలకు కలిగే నష్టాలను చెప్పాలన్నదే తమ ఉద్దేశమని సురేంద్రబాబు తెలిపారు. శుక్రవారం నుంచి చేపట్టనున్న తల్లిపాల వారోత్సవాల్లో ఈ పాటతో తల్లుల్లో అవగాహన వస్తుందని హరికృష్ణ పేర్కొన్నారు.