అమ్ము ఒక సోషల్ డ్రామా

అమ్ము ఒక సోషల్ డ్రామా

టైటిల్: అమ్ము, కాస్ట్: ఐశ్వర్య లక్ష్మి, నవీన్ చంద్ర, బాబీ సింహా, అంజలీ అమీర్, మాలా పార్వతి, 
రన్ టైం: 2 గం.16 ని., డైరెక్టర్:  చారుకేష్ శేఖర్
ప్లాట్ ఫాం: అమెజాన్ ప్రైమ్, లాంగ్వేజ్: తెలుగు, తమిళం, మలయాళం

అమ్ము(ఐశ్వర్య లక్ష్మి)కి వాళ్ల పొరుగింట్లో ఉండే  సీఐ రవీంద్రనాథ్‌‌‌‌(నవీన్ చంద్ర)తో పెండ్లి జరుగుతుంది. పెండ్లైన కొత్తలో ఇద్దరూ బాగానే ఉంటారు. కానీ, రోజులు గడిచే కొద్దీ రవీంద్ర అసలు రూపం బయటపడుతుంది. చిన్న విషయాలకే చిరాకు పడుతూ కోప్పడుతుంటాడు. అది కాస్తా కొట్టడం, హింసించడం దాకా వెళ్తుంది. ఏమీ చేయలేక తనదే తప్పు అనుకుని ఊరుకుంటుంది అమ్ము. భర్తను మార్చడానికి అమ్ము చాలారకాలుగా ట్రై చేస్తుంది. అయినప్పటికీ తనలో ఎలాంటి మార్పు రాదు. దీంతో భర్తకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలని డిసైడ్ అవుతుంది అమ్ము. దానికోసం అమ్ము ఏం చేసింది? భర్తకు ఎలా బుద్ధి చెప్పింది? అనేది మిగతా కథ.

అమ్ము ఒక సోషల్ డ్రామా. డొమెస్టిక్ వయొలెన్స్‌‌‌‌ను ఎదుర్కొంటున్న ఎంతోమంది భార్యల కథ ఇది. భర్త పెట్టే హింసను తట్టుకోలేక, బయటకు చెప్పుకోలేక ఆడవాళ్లు పడే బాధను స్క్రీన్‌‌‌‌పై చక్కగా చూపించాడు దర్శకుడు. అయితే ఈ సమస్యను రొటీన్ మెలోడ్రామాలా కాకుండా ఒక రివెంజ్ డ్రామాగా డిజైన్ చేయడం వల్ల సినిమా ఇంట్రెస్టింగ్‌‌‌‌గా అనిపిస్తుంది. మొదట్లో కాస్త స్లో అనిపించినా.. భర్తపై ఎదురు తిరగాలని అమ్ము డిసైడ్ అయిన దగ్గర్నుంచి సినిమా మరోలా ఉంటుంది. అమ్ముగా ఐశ్వర్య లక్ష్మి యాక్టింగ్ సినిమాకే హైలైట్. రెండు షేడ్స్ ఉన్న అమ్ము పాత్రలో ఐశ్వర్య ఒదిగిపోయింది. అహంకారం, శాడిజం ఉన్న వ్యక్తిగా నవీన్‌‌‌‌చంద్ర బాగా నటించాడు. వీళ్లతో పాటు మిగిలిన పాత్రల నటన, మాటలు, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ కూడా ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. వీకెండ్‌‌‌‌కు ఓ మంచి సోషల్ డ్రామా చూడాలనుకుంటే అమ్ము బెస్ట్ ఛాయిస్.