
జమ్మూకాశ్మీర్ ..పహల్గాంలో పాక్ ఉగ్రవాదులు పర్యాటకులను అత్యంత క్రూరంగా చంపిన తరువాత భారత్ .. పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. ప్రస్తుతం రెండోసారి అమృతసర్‌లో సైరన్ మోగడంతో భారత ఆర్మీ అధికారులు అప్రమత్తమయ్యారు. దాదాపు పది రోజుల పాటు పాకిస్తాన్ తీరును గమనించినభారత్.. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ధీటుగా సమాధానం ఇస్తుంది. ఆ తరువాత ఉగ్రవాదుల లక్ష్యంగా భారత్.. పాక్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది.
ఇదిలా ఉండగా ఈ రోజు ( మే 9) ఉదయం అమృత్ సర్ లో సైరన్ మోగింది. దీంతో అక్కడి ప్రజలు.. అధికారులు అప్రమత్తమయ్యారు. పాకిస్తాన్ ప్రయోగిస్తున్న క్షిపణులను భారత సైన్యం నిర్వీర్యం చేస్తుంది. పాకిస్తాన్ ప్రయోగించిన మిస్సైళ్లను భారత్ ఎస్ 400 సిస్టమ్ తో ధ్వంసం చేసింది. అమృతసర్ లో ప్రజలను ఎవరికి బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అమృతసర్ లో పేలుళ్ల శబ్దాలు మోగిపోతున్నాయి. అక్కడి జనాలకు ఏం జరుగుతుందో అర్దం కాని పరిస్థితి నెలకొంది.
అమృతసర్‌లో సైరన్ మోగడంతో ఎటు నుంచి దాడి చేసినా ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. పాక్ నుంచి వచ్చే డ్రోన్లు, మిస్సైల్స్‌ను నిర్వీర్యం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. పాక్ నుంచి వస్తున్న విపత్కర పరిస్థితులను గుర్తించి ముందుగానే ఎయిర్ రైడ్ సైరన్ మోగే విధానాన్ని భారత్ సైన్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పాక్ డ్రోన్లను చాలా ఈజీగా అడ్డుకుంటోంది. పంజాబ్‌పై డ్రోన్స్, మిస్సైల్స్‌లో ఎటాక్‌కు అక్కడి సైన్యం యత్నిస్తోంది. దీంతో భారత జవాన్లు దీటుగా ఎదుర్కొంటున్నారు. ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. పాక్ నుంచి వస్తున్న డ్రోన్లను నిర్వీర్యం చేస్తున్నారు. ఇప్పటి వరకూ 40 నుంచి 50 వరకూ డ్రోన్స్ కూల్చివేసినట్లు తెలుస్తోంది.
ఉగ్రవాదులకు వత్తాసు పలుకుతున్న పాక్‌సైన్యం.. పాక్ అధికారులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక.. భారత్‌పై ఎదురుదాడి ప్రయత్నాలను స్పీడప్ చేసింది. ఈ క్రమంలో గురువారం రాత్రి ( మే 8) జమ్మూకాశ్మీర్ లో పాక్ ఉగ్రవాదులు పన్నిన కుట్రను భారత సైన్యం తిప్పికొట్టింది. ఇంకా ఉద్రికత్తలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో జమ్మూలో బ్లాక్ అవుట్ ప్రకటించారు.
జమ్మూ లక్ష్యంగా పాక్ దాడులు.. తిప్పికొడుతోన్న భారత సైన్యం..
జమ్మూ లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. భారత వైమానిక రక్షణ దళాలు పాకిస్తానీ డ్రోన్లను నేలకూలుస్తున్నాయి. పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని, ఆకాశంలో మెరుపులు కనిపిస్తున్నట్లు ప్రజలు చెబుతున్నాయి. భయంతో పరుగులు తీస్తున్నారు.
వైమానిక రక్షణ వ్యవస్థలను కూల్చేసిన భారత్
భారత్ దాడులతో పాకిస్తాన్ అల్లాడుతుంది. పాక్‌లోని 2 వైమానిక రక్షణ వ్యవస్థలను కూల్చేసింది భారత్. సర్గోధా, ఫైసలాబాద్‌లోని రక్షణ వ్యవస్థలను కూల్చినట్లు ప్రకటించింది.