అమూల్ పాలు లీటరుపై రూ.3పెంపు

అమూల్ పాలు లీటరుపై రూ.3పెంపు

గుజరాత్ డెయిరీ కో-ఆపరేటివ్ అమూల్ తాజా పాలపై లీటరుకు రూ.3 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపుతో అమూల్ గోల్డ్ ధర లీటరుకు రూ. 66, అమూల్ తాజా లీటరుకు రూ. 54, అమూల్ ఆవు పాలు లీటరుకు రూ. 56, అమూల్ ఎ2 గేదె పాలు లీటరుకు రూ.70గా ఉంటుందని అమూల్ ఒక ప్రకటనలో తెలిపింది. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) తన పాల ఉత్పత్తులను అమూల్ బ్రాండ్‌తో మార్కెట్ చేస్తోంది.

అయితే చివరిసారిగా అక్టోబర్‌లో అమూల్ గోల్డ్, తాజా, శక్తి పాల బ్రాండ్‌ల ధరలను లీటరుకు రూ.2 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మొత్తం నిర్వహణ వ్యయం, పాల ఉత్పత్తి వ్యయం పెరగడం వల్లే ధరలు పెంచామని అమూల్ స్పష్టం చేసింది. గతేడాదితో పోలిస్తే పశువుల దాణా ఖర్చు కూడా దాదాపు 20 శాతానికి పెరిగిందని అమూల్ పేర్కొంది. దాంతో పాటు గతేడాది కంటే రైతుల ధరలను 8-9 శాతం వరకు పెంచాయని తెలిపింది.