- అశ్వత్ కౌశిక్ అరుదైన రికార్డు
సింగపూర్: ఇండియన్ సంతతికి చెందిన సింగపూర్ బాలుడు అశ్వత్ కౌశిక్.. చెస్‌లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. బర్గ్‌డోర్ఫర్ స్టాడ్‌థౌస్ ఓపెన్‌లో భాగంగా జరిగిన ఓ గేమ్‌లో 8 ఏండ్ల కౌశిక్.. 37 ఏండ్ల పోలెండ్ గ్రాండ్ మాస్టర్ జాసెక్ స్టోపాను ఓడించాడు. దీంతో క్లాసికల్ చెస్‌లో గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన యంగెస్ట్ ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. కొన్ని వారాల ముందు సెర్బియా ప్లేయర్ లియోనిడ్ ఇవనోవిచ్ (అశ్వత్ కంటే కొన్ని నెలలు పెద్ద) బెల్‌గ్రేడ్ ఓపెన్‌లో 60 ఏండ్ల గ్రాండ్‌మాస్టర్ మిల్కో పాప్‌చెవ్ (బల్గేరియా)ను ఓడించి నెలకొల్పిన రికార్డును బద్దలుకొట్టాడు. ఫిడేలో కౌశిక్ 37,388 ర్యాంక్‌లో ఉన్నాడు. 2017లో అతని ఫ్యామిలీ సింగపూర్‌కు వలస వెళ్లింది.
