హైదరాబాద్ ఫార్ములా ప్రాక్టీస్ ఈ రేసింగ్లో ప్రమాదం

హైదరాబాద్ ఫార్ములా ప్రాక్టీస్ ఈ రేసింగ్లో ప్రమాదం

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన జరగుతున్న  ఫార్ములా ప్రాక్టీస్ ఈ రేస్లో ప్రమాదం చోటుచేసుకుంది. టర్నింగ్ పాయింట్ వద్ద  ఓ వెహికల్ డివైడర్ను ఢీకొట్టింది. దీంతో నిర్వాహకులు రేసును కొద్దిసేపు నిలిపేశారు. ఆ తర్వాత యథావిధిగా ప్రాక్టీస్ రేస్ జరిగింది. లుంబినీ పార్క్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వరకు రేస్ సాగనుంది. మొత్తం 11 జట్ల నుంచి  22 మంది డ్రైవర్లు  ఈ ప్రీ రేస్ లో పాల్గొన్నారు. ఇవాళ్టీ ప్రాక్టీస్ రేస్తో రేసర్లకు ఈ ట్రాక్ మీద ఒక అవగాహన  రానున్నది. 18 మలుపులతో కూడిన ఈ ట్రాక్ పై ఎలా స్పందిస్తుంది.. కార్లను ఎలా  అదుపు చేసుకోవాలి..   ఎక్కడ వేగం పెంచాలి.. వంటి విషయాలపై వారికి స్పష్టమైన అవగాహన కలిగేందుకు ఈ ప్రీ రేసును నిర్వహించనున్నారు.