వ్యాక్సిన్​ కంపెనీలకు అడ్వాన్స్​గా రూ. 4,500 కోట్లు

వ్యాక్సిన్​ కంపెనీలకు అడ్వాన్స్​గా రూ. 4,500 కోట్లు
  • వ్యాక్సిన్​ సప్లయ్​ పెంచేందుకు ప్రభుత్వ చొరవ

న్యూఢిల్లీ: వ్యాక్సిన్స్​ సప్లయ్​ పెంచేందుకు రెండు వ్యాక్సిన్​ తయారీ కంపెనీలకు రూ. 4,500 కోట్ల డబ్బు అడ్వాన్స్​గా ఇస్తున్నట్లు ఫైనాన్స్​మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్​ ఇచ్చే ప్రోగ్రామ్​ను మే 1 నుంచి అమలు చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తగినన్ని వ్యాక్సిన్స్​ను అందుబాటులోకి తేవడానికి ఈ డబ్బును ప్రభుత్వం సమకూరుస్తోంది. 20 కోట్ల వ్యాక్సిన్స్​ సప్లయ్​ కోసం సీరమ్​ ఇన్​స్టిట్యూట్​కు రూ. 3 వేల కోట్లు, 9 కోట్ల వ్యాక్సిన్స్​ సప్లయ్​ కోసం భారత్​ బయోటెక్​కు రూ. 1,500 కోట్లను ప్రభుత్వం ఇవ్వనుంది.  జులై నాటికి ఈ వ్యాక్సిన్స్​ను సప్లయ్​ చేయాల్సి ఉంటుంది. ఒక్కో డోసుకు రూ. 150 రేటును నిర్ణయించారు. అడ్వాన్స్​ పేమెంట్​ ఇచ్చేందుకు రూల్స్​ను రిలాక్స్​ చేసినట్లు ఫైనాన్స్​ మినిస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఎలాంటి బ్యాంక్​ గ్యారంటీ లేకుండానే ఈ అడ్వాన్స్​ పేమెంట్​ జరపనున్నారు. కోవిడ్​–19 వ్యాక్సిన్స్​ తయారీ కోసం రూ. 3, 000 కోట్లు అవసరమని ఈ నెల మొదట్లో సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ సీఈఓ అదర్​ పూనావాలా చెప్పిన విషయం తెలిసిందే. మూడో ఫేజ్​ వ్యాక్సినేషన్​ స్ట్రేటజీ కింద వ్యాక్సిన్​ తయారీ కంపెనీల ప్రొడక్షన్​ కెపాసిటీలో సగాన్ని ప్రతి నెలా తమకు ఇవ్వాలని ప్రభుత్వం కోరుతోంది.  ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ వ్యాక్సినేషన్​ ప్రోగ్రామ్​ యధాప్రకారం కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ వ్యాక్సిన్​ సెంటర్లలో ఫ్రీగానే వ్యాక్సినేషన్​ అందించనున్నట్లు పేర్కొంది. తాజా డేటా ప్రకారం 2.59 లక్షల కొత్త కేసులతో కరోనా రోగుల సంఖ్య మొత్తం 1.53 కోట్లకు చేరింది. యూఎస్​ తర్వాత కరోనా రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశం ఇండియానే.

కోవాగ్జిన్​ కెపాసిటీని 70 కోట్లకు పెంచాం...భారత్​ బయోటెక్
కోవిడ్​–19 వ్యాక్సిన్​ కోవాగ్జిన్ ప్రొడక్షన్​​కెపాసిటీని 70 కోట్లకు పెంచినట్లు భారత్​ బయోటెక్​ మంగళవారం వెల్లడించింది. హైదరాబాద్​, బెంగళూరులలోని ఫెసిలిటీలలో దశలవారీగా ఈ ప్రొడక్షన్​ కెపాసిటీని పెంచగలిగినట్లు పేర్కొంది. ఇనాక్టివేటెడ్​ వ్యాక్సిన్స్​లో సేఫ్టీ ఎక్కువని, కాకపోతే తయారీ ఖరీదైనదని భారత్​ బయోటెక్​ తెలిపింది. లైవ్​ వైరస్​ వ్యాక్సిన్స్​తో పోలిస్తే వీటిలో ఈల్డ్స్​ కూడా తక్కువేనని పేర్కొంది. తక్కువ టైములోనే కోవాగ్జిన్​ ప్రొడక్షన్​ కెపాసిటీ పెంచగలిగామని, ఇందుకోసం బీఎస్​ఎల్​–3 ఫెసిలిటీస్​ను ప్రత్యేక డిజైన్​తో అందుబాటులోకి తెచ్చామని వివరించింది. ఇతర దేశాలలోని కంపెనీలతో మాన్యుఫాక్చరింగ్​ పార్ట్​నర్షిప్స్​ కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు కూడా భారత్​ బయోటెక్​ వెల్లడించింది. కోవాగ్జిన్​ కోసం డ్రగ్​ సబ్​స్టెన్స్​ తయారీకి ఇండియన్​ ఇమ్యూనలాజికల్స్​ (ఐఐఎల్​)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఇండియాతోపాటు, మరి కొన్ని దేశాలలోనూ కోవాగ్జిన్​కు ఎమర్జన్సీ యూజ్​ అప్రూవల్స్​ వచ్చినట్లు పేర్కొంది. మెక్సికో, ఫిలిప్పైన్స్​, ఇరాన్​, పరాగ్వే, గుటిమాలా, నికారుగ్వా, గుయానా, వెనిజులా, జింబాబ్వే సహా మరి కొన్ని దేశాలలో ఇప్పటికే తమ వ్యాక్సిన్​కు అనుమతులు వచ్చాయని కంపెనీ తెలిపింది.

క్లినికల్​ ట్రయల్స్​కు పర్మిషన్​ ఇవ్వండి:జాన్సన్​ అండ్​ జాన్సన్
 తాము తయారు చేసే సింగిల్​ డోస్​ కోవిడ్​–19 వ్యాక్సిన్​ క్లినికల్​ ట్రయల్స్​కు అనుమతి కావాలని జాన్సన్​ అండ్​ జాన్సన్​ కంపెనీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ సింగిల్​ డోస్​ వ్యాక్సిన్​కు అమెరికాలోని ఎఫ్​డీఏ ఈ ఏడాది ఫ్రిబవరిలోనే అనుమతి ఇచ్చింది. ఎమర్జన్సీ యూజ్​ కోసం వివిధ దేశాలలోని ప్రభుత్వ అథారిటీస్​తో కలిసి పనిచేస్తున్నట్లు జాన్సన్​ అండ్​ జాన్సన్​ వెల్లడించింది. విదేశీ కంపెనీల వ్యాక్సిన్స్​ అన్నింటికీ ఎమర్జన్సీ యూజ్​ అప్రూవల్స్​ను ఫాస్ట్​ట్రాక్​పై పెట్టాలని కేంద్ర ప్రభుత్వం కిందటి వారం నిర్ణయించింది. డబ్ల్యూహెచ్​ఓ, యూఎస్​, యూరప్​, బ్రిటన్​, జపాన్​ దేశాలలో ఇప్పటికే ఇలాంటి అనుమతులు పొందిన కంపెనీలకు వెంటనే అనుమతులు ఇచ్చేలా చొరవ తీసుకోవాలని నిర్ణయించారు. డ్రగ్స్​ కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా (డీసీజీఐ)కి అప్రూవల్​ కోసం దరఖాస్తు చేసినట్లు జాన్సన్​ అండ్​ జాన్సన్​ వెల్లడించింది. రెఫ్రిజిరేటర్​ టెంపరేచర్స్​ వద్దే ఈ జాన్సన్​ అండ్​ జాన్సన్​ కంపెనీ వ్యాక్సిన్​ను స్టోర్​ చేసుకునే వీలుంటుంది. ఆక్స్​ఫర్డ్​ యూనివర్శిటీ–అస్ట్రాజెనెకా తయారు చేసిన ఒక వ్యాక్సిన్​, భారత్​ బయోటెక్​ తయారు చేసిన ఒక వ్యాక్సిన్​ ఇప్పటికే మన దేశపు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. 

ఇంపోర్ట్​ డ్యూటీ రద్దు...
కోవిడ్​–19 వ్యాక్సిన్స్​పై ఇంపోర్ట్​ డ్యూటీ 10 శాతాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్​ చేస్తోంది. విదేశీ వ్యాక్సిన్స్​ను తక్కువ రేటుకే అందుబాటులోకి తేవాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటోంది. దేశంలో వ్యాక్సిన్స్​ సప్లయ్​ పెరిగేలా చూడాలని ప్రభుత్వం టార్గెట్​గా పెట్టుకుంది. వ్యాక్సిన్స్​పై ప్రస్తుతం 10 శాతం ఇంపోర్ట్​ డ్యూటీ, 16.5 శాతం ఐజీఎస్​టీ విధిస్తున్నారు. సోషల్​ వెల్ఫేర్​ సర్​ ఛార్జ్​ కూడా అమలులో ఉంది. దీంతో విదేశీ వ్యాక్సిన్స్​ రేటు ఇండియాలోని సీరమ్​ ఇన్​స్టిట్యూట్, భారత్​ బయోటెక్​​ వ్యాక్సిన్స్​తో పోలిస్తే ఖరీదవుతున్నాయి. కస్టమ్స్​ డ్యూటీ రద్దు ప్రపోజల్​ను సీరియస్​గా పరిశీలిస్తున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని పేర్కొంటున్నారు. విదేశీ వ్యాక్సిన్​ కంపెనీలు సప్లయ్​ ప్రపోజల్స్​తో ముందుకు వచ్చినప్పుడు ఆ నిర్ణయం ప్రకటిస్తారని వారంటున్నారు. ఇప్పటిదాకా అలాంటి ప్రపోజల్స్​ ఏవీ రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.