ప్లాస్టిక్ బాటిల్‌‌‌‌తో విమానం తయారు చేసిండ్రు

ప్లాస్టిక్ బాటిల్‌‌‌‌తో విమానం తయారు చేసిండ్రు

పిల్లలు స్కూల్‌‌‌‌ నుంచి ఇంటికిరాగానే హోం వర్క్‌‌‌‌, చదువే కాకుండా చిన్న చిన్న యాక్టివిటీస్‌‌‌‌ చేయిస్తుండాలి. వాటివల్ల పిల్లల్లో క్రియేటివిటీ పెరుగుతుంది. చురుకుగా తయారవుతారు. అందుకు ఇంట్లో ఖాళీగా పడేసిన ప్లాస్టిక్ బాటిల్స్ బాగా యూజ్ అవుతాయి. వాటితో చిన్న చిన్న యాక్టివిటీలు చేయించొచ్చు.

అట్ట పెట్టెను తీసుకొని విమానం రెక్కల్లా చిన్న ముక్కలుగా కత్తిరించాలి. అరలీటర్ ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని బాటిల్‌‌‌‌ వెనక, మధ్యలో రెండు పక్కలా రెక్కలు పట్టేంత కత్తిరించాలి. తరువాత రెక్కల్ని గమ్‌‌‌‌తో బాటిల్‌‌‌‌కి అతికించాలి. బాటిల్‌‌‌‌ మూతకు చిన్న రంధ్రం చేసి ఫ్యాన్‌‌‌‌ పెట్టాలి. తరువాత దారంతో కట్టి గాలికి వదిలేస్తే విమానంలా అటు ఇటు తిరుగుతుంది. రెండు ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకోవాలి. ఒక బాటిల్‌‌‌‌.. మూతని పెన్సిల్ సైజ్‌‌‌‌లో కత్తిరించాలి. వేరొక బాటిల్‌‌‌‌ కింది భాగాన్ని కొంచెం చిన్నగా కత్తిరించాలి. పాత బ్యాగ్‌‌‌‌ జిప్‌‌‌‌ తీసుకొని రెండు బాటిల్స్‌‌‌‌ కలుపుతూ గమ్‌‌‌‌తో అతికించాలి. దీన్ని పెన్సిల్‌‌‌‌ బాక్స్‌‌‌‌, స్కెచ్‌‌‌‌ పెన్‌‌‌‌ బాక్స్‌‌‌‌గా వాడుకోవచ్చు.