600కి.మీ ప్రయాణం చేసిన పసి ‘హృదయం‘

600కి.మీ ప్రయాణం చేసిన పసి ‘హృదయం‘

పదిహేను రోజుల పసిప్రాణం. 600 కిలోమీటర్లదూరం. 12 జిల్లాలను దాటితే గానీ అందని గమ్యం. ఆ పసి గుండెను కాపాడటానికి ప్రతి సెకనూ విలువైనదే. నేలపై ప్రయాణానికి 15 గంటలపైనే పడుతుంది. ఫ్లైట్ లో తీసుకెళ్తే ఊపిరాడక పోవచ్చు.ఈ పరిస్థితుల్లో  అంబులెన్స్(కేఎల్60జే7739)రంగంలోకి దిగింది. ఎమర్జెన్సీ ఎక్విప్ మెం ట్ తోబిడ్డను తీసుకుని మంగళవారం ఉదయం 11గంటలకు మంగుళూరు నుంచి బయల్దేరింది.బిడ్డ తల్లిదండ్రులు సానియా, మిథా, డాక్టర్లతో పాటుఅంబులెన్స్ లో ఓ టీమ్ కూడా ఉంది. వాళ్లు ఓ కెమెరా పట్టుకుని కూర్చున్నారు. ప్రయాణాన్ని ఫేస్ బుక్ లోలైవ్ స్ట్రీమ్ చేస్తున్నారు. ఎందుకో తెలుసా? 15 గంటలసుదీర్ఘ ప్రయాణాన్ని 10 గంటలకు తగ్గించేందుకు!‘చైల్డ్ ప్రొటెక్షన్ టీమ్’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఈఐడియా వేసింది. ప్రజలకు విషయం తెలియజేసి అంబులెన్స్ కు దారివ్వాలని కోరింది. ఇందుకు లైవ్ స్ట్రీమింగ్ ను వాడింది. దీనికి మంచి ఫలితమే వచ్చింది.

కేరళ సీఎం పినరయి విజయన్, కాం గ్రెస్ నేత శశిథరూర్ కూడా అంబులెన్సుకు దారివ్వాలని కోరారు. చైల్డ్ ప్రొటెక్షన్ టీమ్ లైవ్ ఫీడ్ ను 8 వేల మంది షేర్ చేశారు.దారిలోవున్న 12 జిల్లాల్లో ని రహదారుల వద్ద చైల్డ్ప్రొటెక్షన్ టీమ్ వాలంటీర్లు వేచి చూశారు. పోలీసులసాయంతో ట్రాఫిక్ అడ్డురాకుండా అంబులెన్సుకు దారి ఇచ్చేలా జాగ్రత్త పడ్డారు. ప్రజలే స్వచ్ఛందంగా అంబులెన్స్ వెళ్లేందుకు దారిచ్చారు. సానియా, మిథా దంపతుల సొంతవూరు కేరళలోని కసర్ గఢ్. 15రోజుల క్రితం సానియా మంగుళూరులోని ఓ ఆస్పత్రిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డగుం డెవాల్వ్స్ లో ఒకటి పని చేయడం లేదు. వెంటనేసర్జరీ చేయాలని, ఇక్కడ సదుపాయాల లేవని డాక్టర్లు చెప్పా రు. తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునాల్ ఇనిస్టిట్యూ ట్ ఫర్ మెడికల్ సైన్సె స్ అండ్ టెక్నాలజీకి తీసుకెళ్లాలని సూచించారు. రాత్రిపూట ప్రయాణం సులువైనా, వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రమాదమని డాక్టర్లు చెప్పడంతో పగటిపూటే రిస్కీ జర్నీని చైల్డ్ప్రొటెక్షన్ టీమ్ చేపట్టింది. బాబు క్షేమంగా హాస్పిటల్కు చేరుకుని ఆపరేషన్ సక్సెస్ కావాలని మనం కూడాఆ దేవుడిని కోరుకుందాం.