భీకరంగా పోట్లాడుకున్న అనకొండ, మొసలి

భీకరంగా పోట్లాడుకున్న అనకొండ, మొసలి

అనకొండ మొసలి వీటిని చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఇక ఈ రెండూ కొట్లాడుకుంటే ఊహించడం కష్టం. కానీ బ్రెజిల్ లో అనకొండ మొసలి భీకరంగా పొట్లాడుకున్నాయి. 30 అడుగుల పొడవున్న గ్రీన్ అనకొండ..మొసలిని చుట్టుముట్టింది. సాధారణంగా నీటిలో మొసలి అత్యంత శక్తివంతమైంది. వెయ్యి ఏనుగుల బలం ఉంటుందంటారు. కానీ..మొసలికే అనకొండ ముచ్చెమటలు పట్టించింది. తనను చుట్టుముట్టిన అనకొండను ఏమీ చేయలేక మొసలి అలాగే ఉండిపోయింది. 


అనకొండ, మొసలి ఘర్షన వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ అపురూప దృశ్యాన్ని గతేడాది సెప్టెంబర్‌లో అమెరికాలోని ఇండియానాకు చెందిన కిమ్ సుల్లివన్ తన కెమెరాలో బంధించగా..తాజా ఇప్పుడు వైరల్‌గా మారింది. క్యూయాబా నది ఒడ్డున మొసలి, అనకొండ మధ్య భీకర యుద్దం జరిగింది. వీ పోరాటం 40 నిమిషాల పాటు కొనసాగింది.