భూమిపై అంగారక గ్రహం..నాసా ప్రయోగం

భూమిపై అంగారక గ్రహం..నాసా ప్రయోగం

ప్రపంచం అంతం అనే వార్తలతో పాటు.. గ్లోబల్ వార్మింగ్  వల్ల రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి. వీటికి పరిష్కారం భూమిలాంటి మరో గ్రహాన్ని కనిపెట్టడమే. ఆ గ్రహాన్ని కనిపెడితే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అయితే విశ్వంలో భూమి లాంటి మరో గ్రహం కూడా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. ఇందుకోసం నాసా శాస్త్రవేత్తలు తెగ పరిశోధనలు చేస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్లో  భూమిపై జీవించలేని పరిస్థితులు ఎదురైతే ఆ గ్రహంపై జీవించేందుకు వీలైతుందని శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. మానవులు నివసించాలంటే  ఆ గ్రహంపై ఆక్సిజన్, నీరు ఉండటం చాలా ముఖ్యం. ఇప్పటి వరకు నాసా శాస్త్రవేత్తల అన్వేషణలో అంగారక గ్రహం  భూమికి ప్రత్యామ్నాయమని తేలింది. 

 భూమిపై అంగారక గ్రహం 

అంగారక గ్రహంపై నివాస యోగ్యతను పరిశీలించడానికి నాసా ఓ ప్రయోగాన్ని చేపట్టబోతుంది. ఇందుకోసం భూమిపైనే అంగారక గ్రహానికి సంబంధించిన కృత్రిమ నివాసాన్ని సృష్టించింది. ఏడాది పాటు ఈ కృత్రిమ అంగారక గ్రహంపై నాసా ప్రయోగం చేయనుంది. హౌస్టన్‌లోని నాసా పరిశోధన కేంద్రంలో కృత్రిమ అంగారక గ్రహాన్ని తీర్చిదిద్దింది. ఈ ఎండా కాలంలో నలుగురు వాలెంటీర్లు గ్రహంలో తమ జీవనాన్ని ప్రారంభిస్తారు. ఈ పరిశోధనలో భాగంగా సుదీర్ఘ ఐసోలేషన్‌లో వాలెంటీర్ల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని శాస్త్రవేత్తలు పరిశీలిస్తారు.

అంగారక గ్రహంపై ఆవాసం...

నాసా సృష్టించిన కృత్రిమ అంగారక గ్రహానికి సంబంధించిన నివాసంలో శాస్త్రవేత్తలు నాలుగు చిన్న గదులను ఏర్పాటు చేశారు. అలాగే  ఒక జిమ్‌, చుట్టూ ఎర్రని ఇసుకను ఉంచారు. కృత్రిమ అంగారక గ్రహంలో ఉండే వాలెంటీర్లకు  ఎలాంటి లోటు కలగకుండా పూర్తిగా సాధారణ ఇంటిని నిర్మించినట్లే ఆవాసాన్ని తయారు చేశారు. 

ఫోటోలు వైరల్..

కృత్రిమ అంగారక గ్రహానికి సంబంధించిన ఫోటోలను నాసా షేర్ చేసింది. NASA యొక్క కొత్త ప్రణాళిక ప్రకారం ఈ ఇల్లు నిర్మించబడింది. ఈ ప్లాన్‌కు క్రూ హెల్త్ అండ్ పెర్ఫార్మెన్స్ ఎక్స్‌ప్లోరేషన్ అనలాగ్ అని పేరు పెట్టారు. NASA  తన ప్రయోగంలో భాగంగా  ఏడాది పాటు ఈ గ్రహంపై ఏర్పాటు చేసిన ఆవాసంలో నివసిస్తారు.  నాసా యొక్క ఈ మార్స్ మిషన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.