ఇన్నోవేషన్లు, టెక్నాలజీపై దృష్టి సారించిన IEEMA

ఇన్నోవేషన్లు, టెక్నాలజీపై దృష్టి సారించిన IEEMA

హైదరాబాద్‌‌‌‌, వెలుగు :  ఇండియన్‌‌ ఎలక్ట్రికల్‌‌ అండ్‌‌ ఎలక్ట్రానిక్స్‌‌ మాన్యుఫాక్చరర్స్‌‌ అసోసియేషన్‌‌ (ఐఈఈఎంఏ) హైదరాబాద్​లో శుక్రవారం ఇంటరాక్టివ్‌‌ సదస్సును తెలంగాణ విద్యుత్‌‌ రంగ ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసింది. దీంతోపాటుగా15వ ఎడిషన్‌‌ ఎలెక్రామా కోసం రోడ్‌‌షోను నిర్వహించింది.

ఈ  సదస్సులో  ట్రాన్స్‌‌కో  మేనేజింగ్‌‌ డైరెక్టర్‌‌  ప్రభాకర రావు, నార్తర్న్​ పవర్‌‌ డిస్ట్రిబ్యూషన్‌‌ కంపెనీ ఆఫ్‌‌ తెలంగాణ లిమిటెడ్‌‌ ఛైర్మన్‌‌ అండ్‌‌ మేనేజింగ్‌‌ డైరెక్టర్‌‌  గోపాల్‌‌ రావు, సదర్న్​ పవర్‌‌ డిస్ట్రిబ్యూషన్‌‌ కంపెనీ ఆఫ్‌‌ తెలంగాణ లిమిటెడ్‌‌  ఛైర్మన్‌‌ అండ్‌‌ మేనేజింగ్‌‌ డైరెక్టర్‌‌   రఘుమా రెడ్డి పాల్గొన్నారు.

దేశంలోని  ఎలక్ట్రికల్,  ఎలక్ట్రానిక్స్‌‌  పరిశ్రమలకు సంబంధించి  ఐఈఈఎంఏ నిర్వహిస్తోన్న అతిపెద్ద స్టాండలోన్‌‌ షోకేస్‌‌ ఎలెక్రామా. ఈ షోను వచ్చే ఏడాది ఫిబ్రవరి 18 నుంచి ఫిబ్రవరి 23  వరకు నోయిడాలోని ఇండియా ఎక్స్‌‌పో మార్ట్‌‌ లో నిర్వహిస్తారు.  ‘రీ ఇమాజిన్‌‌ ఎనర్జీ– ఫర్‌‌ సస్టెయినబల్‌‌ ఫ్యూచర్‌‌’ అనే థీమ్​తో  దీనిని ఏర్పాటు చేస్తారు. కరెంటు రంగంలో ఇన్నోవేషన్లు, టెక్నాలజీ, ఇంధన పరిరక్షణ,  కార్బన్‌‌ నెట్‌‌ జీరోపై ఈ ఎడిషన్‌‌ దృష్టి సారించనుంది.

ఐఈఈఎంఏ , ప్రెసిడెంట్‌‌( ఎలెక్ట్‌‌)  హమ్జా అర్సివాలా మాట్లాడుతూ  ఈసారి దాదాపు ఆరు బిలియన్‌‌ డాలర్ల విలువ కలిగిన వ్యాపార లావాదేవీలను నిర్వహించాలని అనుకుంటున్నామని అన్నారు. తెలంగాణ నుంచి 80 వరకు కంపెనీలు హాజరయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఎలెక్రామాకు దాదాపు 2వేల మంది ఎగ్జిబిటర్లు, 5 కాంకరెంట్‌‌ కాన్ఫరెన్స్‌‌లు, 50వేల మందికి పైగా సందర్శకులు 70 దేశాల నుంచి వస్తారని ఐఈఈఎంఏ చెబుతోంది.