
దేశంలో యువతులపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కామాంధుల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు..పసికందులను కూడా వదలడం లేదు. శంషాబాద్ లో దారుణం జరిగింది. ఓ చిన్నారిపై అఘాయిత్యం ఘటన స్థానికంగా కలకలం రేపింది. 4 ఏళ్ల చిన్నారిపై కామాంధులు అతి దారుణంగా అఘయిత్యానికి పాల్పడ్డారు. పాపను స్థానికులు నీలోఫర్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. నీలోఫర్‌లో వైద్యులు పాపకు సర్జరీ చేశారు. పాప పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
శంషాబాద్ ఫ్లై ఓవర్ లేబర్ క్యాంప్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారి తల్లిదండ్రులు బెంగళూరు నుంచి ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు వెంకటయ్యను అరెస్ట్ చేశారు.