భర్త మృతి.. ఆస్పత్రి ఎదుట భార్య ఆందోళన

భర్త మృతి.. ఆస్పత్రి ఎదుట భార్య ఆందోళన

హైదరాబాద్ మెహదీపట్నం ప్రీమియర్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరిన జై కిషన్ అనే వ్యక్తి చికిత్సపొందుతూ మృతి చెందాడు. 15 రోజులపాటు చికిత్స చేసిన వైద్యులు ప్రాణాలను కాపాడలేకపోయారని మృతుడి భార్య రాజ్యలక్ష్మి ఆరోపించింది. తమ నుంచి వైద్యులు దాదాపు రూ.16 లక్షలు వసూలు చేశారని తెలిపింది. వైద్యులు సకాలంలో చికిత్స అందించకపోవడంతో  కిషన్ చనిపోయాడని ఆరోపించింది. తన భర్త మరణానికి కారణమైన డాక్టర్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.   

మృతుడి భార్య రాజ్యలక్ష్మి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడంతో మృతుడి కుటుంబ సభ్యులు,బంధువులు బోరున విలపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. ఈ విషయంపై పోలీసులు జోక్యం చేసుకుని బాధ్యులను శిక్షించాలని వేడుకున్నారు.