
రంగారెడ్డి జిల్లా : నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. సెలూన్ షాప్‌లో రాజు (50) హేర్ కటింగ్ చేసే వ్యక్తిని మరో బార్బర్ అతికిరాతకంగా గొంతు కోసి చంపాడు. హత్య చేసి తర్వాత నేరుగా నార్సింగి పోలీస్ స్టేషన్ లో నిందితుడు ప్రవీణ్ లొంగిపోయాడు. హుటాహుటిన ఘటన స్థలానికి నార్సింగి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో హత్య జరిగినట్లు సమాచారం. వీరు ఇద్దరు వరుసకు బంధువులు అవుతారు. గతంలో వీరిమధ్య చిన్న చిన్న గొడవలు అయ్యాయి. సంఘటన స్థలానికి నార్సింగి సిఐ హరికృష్ణ రెడ్డి చేరుకున్నారు.
అయితే గత డిసెంబర్ 31 నైట్ వారి తమ ఇళ్ల ఎదుట వేసుకున్న ముగ్గులు విషయంలో ఇరువురికి తగాదాలు వచ్చాయి. తన ఇంటి ఎదుట ముగ్గును చెడిపేశాడని రాజుతో ప్రవీణ్ గొడవ పడ్డాడు. అప్పట్లో రాజు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పెద్దలు సర్ది చెప్పి కేసు వాపసు చేయించారు.