ఈషా రెబ్బా, కుషిత కల్లపు, రాశీ సింగ్, ప్రిన్స్ సిసిల్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్ 2 ’. ఎస్ కేఎన్ నిర్మిస్తున్న ఈ సిరీస్‌కు డైరెక్టర్ మారుతి షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నాడు. కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించాడు. ఆహా ఓటీటీలో డిసెంబర్ 13 నుంచి ఈ సెకండ్ సీజన్ స్ట్రీమింగ్ కాబోతోంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన సంయుక్త ఇలాంటి మంచి వెబ్ సిరీస్ ప్రేక్షకులకు రీచ్ అవ్వాలని చెప్పింది. మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో రూపొందించిన ఈ సిరీస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుందని మారుతి, ఎస్‌కేఎన్ అన్నారు.
ఈషా రెబ్బా మాట్లాడుతూ ‘రోజెస్ అంటే సున్నితంగా ఉంటాయని అనుకోవద్దు, ముళ్లు కూడా ఉంటాయి. అందర్నీ ఎంటర్‌టైన్ చేసేలా ఈ సిరీస్ ఉంటుంది’ అని చెప్పింది. సీజన్ 1ను మించేలా సెకండ్ సీజన్ ఉంటుందని కుషిత కల్లపు అంది.
ఫస్ట్ సీజన్ చూడని వాళ్లకు కూడా సీజన్ 2 ఫ్రెష్‌గా అనిపిస్తుందని దర్శకుడు కిరణ్ అన్నాడు. కార్యక్రమానికి హాజరైన హీరోయిన్స్ రాశీ సింగ్, రూపా కొడవయూర్ ఈ సిరీస్‌కు మంచి ఆదరణ దక్కాలని కోరారు. నటీనటులు ప్రగతి, ఇనయ సుల్తానా, సూర్య శ్రీనివాస్, బాంధవి శ్రీధర్, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ తదితరులు పాల్గొన్నారు.

