వరంగల్‌లో అర్థరాత్రి భార్యభర్తలు దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమేనా?

వరంగల్‌లో అర్థరాత్రి భార్యభర్తలు దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమేనా?

వరంగల్ జిల్లా : చెన్నారావుపేట మండలం 16 చింతల్ తండాలో బుధవారం అర్థరాత్రి దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తు్న్న భార్యాభర్తలను ఓ యువకుడు హత్య చేశాడు. భార్య అక్కడికక్కడే చనిపోగా.. చికిత్స పొందుతూ భర్త మృతి చెందాడు. భార్యాభర్తలు బానోతు శ్రీను, సుగుణ లుగా పోలీసులు గుర్తించారు. హత్యకు పాల్పడింది గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన యువకుడు. హత్యకు కారణం ప్రేమ వ్యవహారమంటూ స్థానికులు చెప్తున్నారు. నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలు విచారణ చేస్తున్నారు.