ధర్మశాలలో భూకంపం

ధర్మశాలలో భూకంపం

హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో భూకంపం సంభవించింది. ఉదయం 5.17 గంటలకు ధర్మశాలలో భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.2గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. ధర్మశాలకు 76 కి. మీ దూరంలో భూకంప కేంద్రం ఉందనిపేర్కొంది.

భూ అంతర్భాగంలో 5  కి.మీ లోతులో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని తెలిపింది. భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో భూకంపం వచ్చిన తర్వాతి రోజే ధర్మశాలలో భూమి కంపించడం గమనార్హం. రోజురోజుకు కుంగిపోతున్న జోషీమఠ్‌లో శుక్రవారం అర్థరాత్రి 2.12 గంటలకు 2.9 తీవ్రతతో భూకంపం సంభవించింది.