Glenn Phillips: జింకను వేటాడే పులిలా: స్టన్నింగ్ క్యాచ్‌తో షాక్‌కు గురి చేసిన SRH ప్లేయర్

Glenn Phillips: జింకను వేటాడే పులిలా: స్టన్నింగ్ క్యాచ్‌తో షాక్‌కు గురి చేసిన SRH ప్లేయర్

న్యూజిలాండ్ క్రికెటర్ గ్లెన్ ఫిలిప్స్ ఫీల్డింగ్ లో అద్భుతాలు చేయడం కొత్త కాదు. నమ్మశక్యం కనై క్యాచ్ లను ఎన్నో అందుకొని ఔరా అనిపించాడు. గ్రౌండ్ లో ఎక్కడున్నా బంతి వస్తే విన్యాసాలు చేస్తాడు. తాజాగా ఒక అద్భుతమైన క్యాచ్ తో ప్రపంచ క్రికెట్ ను షాక్ కు గురి చేశాడు. సింగిల్  హ్యాండ్ క్యాచ్ తో శెభాష్ అనిపించాడు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఈ క్యాచ్ నమోదయింది. 

మూడో రోజు ఆటలో భాగంగా దక్షిణాఫ్రికా భారీ ఆధిక్యం దిశగా వెళ్తున్న సమయంలో ఫిలిప్స్ సఫారీలకు షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ 60 వ  ఓవర్లో హెన్రీ వేసిన లెంగ్త్ డెలివరీని కీగన్ పీటర్సన్ పాయింట్ దిశగా కట్ చేశాడు. ఈ స్థానంలో ఫీల్డింగ్ చేస్తున్న ఫిలిప్స్.. గల్లీలో గోల్ కీపర్ లాగా ఎడమ వైపుకు ఎగిరి ఒక్క చేత్తో క్యాచ్ ను ఒడిసి పట్టాడు. క్యాచ్ అనంతరం ఫిలిప్స్ గర్జనతో తన సెలెబ్రేషన్ ను జరుపుకున్నాడు. పీటర్సన్ కు అక్కడ ఏం జరిగిందో అర్ధం కాక అక్కడే కాసేపు ఆగిపోయాడు. ఈ క్యాచ్ తో దక్షిణాఫ్రికా వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఐపీఎల్ లో ఫిలిప్స్ సన్ రైజర్స్ తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. 

Also Read : ఇలా వచ్చి అలా వెళ్లారు: టీమిండియాను గట్టెక్కించిన రోహిత్ శర్మ  
      
నాలుగు వికెట్లకు 202 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా 235 పరుగులకు ఆలౌటైంది. 33 పరుగులకే తమ చివరి ఆరు వికెట్లను కోల్పోయి కివీస్ ముందు 267 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఛేజింగ్ లో భాగంగా న్యూజిలాండ్ మూడో రోజు అట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది. క్రీజ్ లో టామ్ లాతమ్ (21), విలియంసన్ (0) ఉన్నారు. అంతకముందు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 235 పరుగులు చేస్తే.. కివీస్ 211 పరుగులకే ఆలౌటైంది.