IND vs ENG 3rd Test: ఇలా వచ్చి అలా వెళ్లారు: టీమిండియాను గట్టెక్కించిన రోహిత్ శర్మ

IND vs ENG 3rd Test: ఇలా వచ్చి అలా వెళ్లారు: టీమిండియాను గట్టెక్కించిన రోహిత్ శర్మ

రాజ్ కోట్ టెస్ట్ తొలి రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్ టీమిండియాపై ఆధిపత్యం చూపించింది. వెంట వెంటనే మూడు వికెట్లు తీసి భారత్ ను ఒత్తిడిలోకి నెట్టింది. ఈ దశలో కెప్టెన్ రోహిత్ శర్మ అజేయ హాఫ్ సెంచరీతో భారత జట్టును తన భుజాల మీద వేసుకున్నాడు. బాధ్యతగా ఆడుతూ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. 72 బంతుల్లో 8 ఫోర్లతో 51 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మరో ఎండ్ లో లోకల్ ప్లేయర్ ఆల్ రౌండర్ జడేజా 22 పరుగులు చేసి చక్కని సహకారం అందించాడు. దీంతో లంచ్ విరామానికి భారత్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. 

Also Read: నాకు నమ్మకముంది.. 2024 టీ20 వరల్డ్ కప్ రోహిత్ కెప్టెన్సీలో గెలుస్తాం

ప్రస్తుతం క్రీజ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ (52)తో పాటు జడేజా(22) ఉన్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు అజేయంగా 59 పరుగులు జోడించారు. ఈ మ్యాచ్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ మంచి ఆరంభం లభించలేదు. యువ ప్లేయర్లు యశస్వి జైస్వాల్ 10 పరుగులు చేసి ఔటైతే.. శుభమన్ గిల్(0), రజత్ పటిదార్(5) సింగిల్ డిజిట్ కే పెవిలియన్ చేరారు. దీంతో 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్ ను రోహిత్, జడేజా ఆదుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. స్పిన్నర్ హార్టీలికి  ఒక వికెట్ దక్కింది.    

ఈ మ్యాచ్ లో టీమిండియా తుది జట్టులో  మూడు మార్పులు చేసింది. ఫామ్ లో లేని తెలుగు కుర్రాడు  భరత్ ను పక్కన పెట్టి ధృవ్ జురెల్ కి ఛాన్స్ ఇచ్చారు. రాహుల్, అయ్యర్ గాయాలతో దూరం కావడంతో సర్ఫరాజ్ కు ఛాన్స్ దక్కింది. ముఖేష్ కుమార్ స్థానంలో   తెలుగు పేసర్ సిరాజ్ కు స్థానం దక్కింది. ఇంగ్లాండ్ తుది జట్టులో స్పిన్నర్ జాక్ లీచ్ స్థానంలో మార్క్ వుడ్ వచ్చి చేరాడు.