చెస్ ఒలింపియాడ్‌ ప్లేయర్స్ కు రజనీకాంత్ విషెస్

చెస్ ఒలింపియాడ్‌ ప్లేయర్స్ కు రజనీకాంత్ విషెస్

ఈరోజు ప్రారంభం కానున్న 44వ చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొననున్న చదరంగం ఆడబోయే పోటీదారులందరికీ నటుడు రజనీకాంత్ శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపించే ఫేమస్ స్టార్ హీరోలలో ఒకరైన రజనీ చేసిన తాజా ట్వీట్ ట్రెండింగ్ మారింది. తాను అత్యంత ఇష్టపడే ఇండోర్ గేమ్స్ లలో చెస్ ఒకటని.. అందులో పాల్గొనబోతున్న ప్లేయర్స్ అందరికీ తన తరపు నుంచి బెస్ట్ విషెస్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. దాంతో పాటు తాను చెస్ ఆడుతున్న ఒక ఫొటోను కూడా షేర్ చేశారు.

ప్రతిష్టాత్మక 44వ చెస్‌ ఒలింపియాడ్‌కు భారత్‌ తొలిసారి ఆతిథ్యమిస్తోంది. చెన్నై వేదికగా నెహ్రూ స్టేడియంలో ఈ పోటీ జరగనుంది. గత నెలలో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన టార్చ్‌ రిలే బుధవారం చెన్నైలోని ప్రెసిడెన్సీ కళాశాల మైదానానికి చేరుకుంది. గురువారం టార్చ్‌ రిలే నెహ్రూ స్టేడియంకు చేరుకోనుంది. ఇక ఈ చెస్‌ ఒలింపియాడ్‌లో 187 దేశాలనుంచి సుమారు 1400మంది గ్రాండ్‌మాస్టర్లు పాల్గొననున్నారు. పురుషుల, మహిళలకు వేర్వేరుగా 11రౌండ్‌లలో జరిగే ఈ పోటీల్లో రష్యా, చైనా జట్లు ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాయి. మొత్తం 30మంది గ్రాండ్‌మాస్టర్లలో 15మంది మహిళా ప్లేయర్స్‌ ఉన్నారు. జట్టు మెంటార్‌గా విశ్వనాథన్‌ ఆనంద్‌ వ్యవహరించనుండగా.. మహిళల జట్టుతో పోలిస్తే పురుషుల జట్టు పటిష్టంగా కనబడుతున్నట్టు సమాచారం. నాలుగు నెలల క్రితం భారత్‌కు ఆతిథ్య హక్కులు దక్కడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నాయి. అయితే మొదటగా ఈ టోర్నీని రష్యాలో నిర్వహిద్దామనుకున్నారు. కానీ ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా అది చెన్నైకి తరలించారు.