త్వరలో నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ : షబ్బీర్‌‌ అలీ

త్వరలో నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ : షబ్బీర్‌‌ అలీ
  •     పైలెట్​ ప్రాజెక్టుగా కొడంగల్ సెగ్మెంట్​: షబ్బీర్​ అలీ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ నిర్మించేందుకు రాష్ట్ర సర్కారు నిర్ణయిం చిందని  సంక్షేమ శాఖల ప్రభుత్వ సలహాదా రు షబ్బీర్‌‌ అలీ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సం క్షేమ గురుకులాలన్నీ వేర్వేరు చోట్ల, విడివిడిగా కాకుండా ఒకేచోట ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారని చెప్పారు. నియోజకవర్గానికి ఒక హబ్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారని ఆయన తెలిపారు.

 సీఎం రేవంత్​ రెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్​లో పైలెట్​ ప్రాజెక్టు చేపడతామని షబ్బీర్​ అలీ చెప్పారు. శనివారం బీసీ, మైనారిటీ, గిరిజన శాఖల బడ్జెట్​ కూర్పుపై సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్​ రెడ్డి నిర్వహించిన రివ్యూలో ఆయన పాల్గొన్నారు. అనంతరం సెక్రటేరియెట్​ మీడియా సెంటర్​లో మాట్లాడారు. సమీక్షలో బీసీ వెల్ఫేర్​పైనే సుదీర్ఘంగా సమీక్ష సాగిందన్నారు.